కరోనా ఎఫెక్ట్‌..ఐఫా అవార్డ్స్‌ వేడుక వాయిదా

కరోనా (కోవిడ్‌-19)వైరస్‌ బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే కేంద్రం అన్ని రాష్ట్రప్రభుత్వాలకు సూచనలను జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి సభలు, సమావేశాలు, కార్యక్రమాలు జరుపుకోవద్దని సూచించింది. ఈ మేరకు ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిలిం అకాడమీ అవార్డ్స్‌(ఐఫా)-2020  కార్యక్రమాన్ని నిర్వాహకులు వాయిదా వేశారు.


కరోనా ప్రభావంతో..ప్రజలు, అభిమానుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని, సినీ పరిశ్రమ పెద్దలను సంప్రదించిన తర్వాత మార్చి నెలాఖరులో ఇండోర్‌లో జరగాల్సిన ఈవెంట్‌ను రద్దు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఐఫా వేడుక కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. తొలుత నిర్ణయించిన తేదీ ప్రకారం మార్చి 27 నుంచి 29 వరకు మూడు రోజులు జరుగాల్సి ఉంది.