అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీరాభిమాని అయిన బుస్సా కృష్ణ గతేడాది 6 అడుగుల ట్రంప్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన కృష్ణ ట్రంప్ విగ్రహానికి పూజలు చేస్తూ..దేవుడిలా ఆరాధిస్తున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు వచ్చినపుడు తన అభిమాని కృష్ణను కలుస్తానని చెప్పారు. ట్రంప్ ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న నేపథ్యంలో బుస్సా కృష్ణను మీడియా పలుకరించింది. నా దేవుడు ఇండియాకు వచ్చినందుకు గర్వపడుతున్నా. ట్రంప్‌ను నేను దేవుడిలా ఆరాధిస్తున్నా. నేను త్వరలోనే తప్పకుండా ఆయనను కలుస్తానని కృష్ణ ధీమా వ్యక్తం చేశాడు. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో డొనాల్డ్ ట్రంప్ అత్యంత కీలక పాత్ర పోషించారని కృష్ణ అన్నాడు. భారత్‌లో పర్యటిస్తున్న ట్రంప్ గతంలో చెప్పినట్టుగానే కృష్ణను కలుస్తారో..? లేదో చూడాలి.
నా దేవుడు ఇండియాకు వచ్చాడు..